నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవీతండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలం వద్ద పిడుగు పడటంతో చరణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్ద ఉన్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
తెలంగాణ
పిడుగు పడి యువకుడు మృతి


