హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక నిమజ్జనానికి ట్రాఫిక్ ఆంక్షలు: సీపీ శ్వేత

HNK: వరంగల్ ట్రైసిటీలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి 25న సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ ఎన్. శ్వేత తెలిపారు. భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి ఉండదని, నిమజ్జన వాహనాలు నిర్దేశిత మార్గాల్లోనే వెళ్లాలని సూచించారు. శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో వాహనాలు నిలపవద్దని కోరారు.