హైదరాబాద్: 28°C
తెలంగాణ

పచ్చదనం, పూల అందాలతో ఆకట్టుకుంటున్న నేషనల్ హైవే

MNCL: బెల్లంపల్లి పట్టణ సమీపంలో నేషనల్ హైవేకి ఇరువైపులా నాటిన పూల మొక్కలు విరబూసి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పచ్చని ఆకుల నడుమ పసుపు వర్ణంలో విరబూసిన పూల వరుసలు బెల్లంపల్లి నేషనల్ హైవేకి ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. పచ్చదనం, పూల అందాలతో బెల్లంపల్లి నేషనల్ హైవే రూపురేఖలే మారిపోయాయని స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.