హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తిశ్రద్ధలతో లక్ష్మీ గణపతి హోమం

AKP :నర్సీపట్నం సత్యసాయి సేవా మందిరంలో ఆదివారం లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా లోక కళ్యాణార్థం హోమం నిర్వహించినట్లు సత్య సాయి సేవా సమితి కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి పాల్గొన్నారు. సుమారు 300 మందికి పైగా భక్తులు హాజరయ్యారు.