హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జాబ్‌మేళాలో 14 మంది విద్యార్థులకు ఉద్యోగాలు'

BHNG: మోత్కూర్ మండలం కోదాడలో ఈ నెల 19న జరిగిన జాబ్‌మేళా నిర్వహించారు. ఈ మేరకు మోత్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన 14 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికై నియామక పత్రాలు అందుకున్నారు. కళాశాల నుంచి 30 మంది పాల్గొనగా, ఐదు దశల ఇంటర్వ్యూల్లో 14 మంది అర్హత సాధించారు. ఎంపికైన వారిని ప్రిన్సిపల్ ఆర్. రవీందర్ అభినందించి మంచి స్థాయిలో స్థిరపడాలని సూచించారు.