హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరువు జిల్లాగా ప్రకటించాలి..!

NGKL: జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు జిల్లాకు కరువు సహాయంగా ప్రకటించాలని, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.