KMR: భిక్కనూర్ మండల కేంద్రంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఇతర ప్రాంతానికి తరలించారని పాలకవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట వారు మాట్లాడారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మండల కేంద్రంలో నిర్మించేంత వరకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని తీర్మానించారు. ఈ విషయంలో రాజకీయాలు చేస్తే ఊరుకోమని వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: 'ఇంటిగ్రేటెడ్ పాఠశాలను సాధించుకుందాం'


