హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకన్నను దర్శించుకున్న వసుంధర దేవి

TPT: వడమాలపేట మండలంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారిని హిందూపురం MLA, హీరో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు నిర్వాహకులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన వసుంధర దేవికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.