హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వైభవంగా జెండా బాలాజీ జాతర ఉత్సవాలు'

నిజామాబాద్‌లో జెండా బాలాజీ దేవస్థానంలో జెండా జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భాద్రపద మాసంలో నిర్వహించే ఈ ఉత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఎనిమిది రోజులుగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భాసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వరస్వామిని ప్రజలు భారీగా దర్శించుకన్నారు.