తమ ఖాతాదారులకు SBI కీలక అడ్వైజరీని జారీ చేసింది. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో బ్యాంక్ శాఖలను సందర్శించి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇతర ప్రత్యక్ష సేవలు, అవసరమయ్యే పనులను సమ్మె ప్రారంభానికి ముందే పూర్తి చేసుకోవాలని కస్టమర్లకు సూచించింది. సమ్మె టైంలోనూ నిత్యావసర బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.
వ్యాపారం
ఖాతాదారులకు SBI కీలక అడ్వైజరీ


