హైదరాబాద్: 28°C
వ్యాపారం

పోర్షేలో 4 వేల ఉద్యోగాలకు కోత

ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ పునర్నిర్మాణంలో భాగంగా పోర్షేలో మరో 4,000 ఉద్యోగాల తొలగింపునకు ప్రణాళిక సిద్ధమైనట్లు ఓ పత్రిక తెలిపింది. 700 మిలియన్‌ యూరోల ఓవర్‌హెడ్ లోటును పూడ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. చైనాలో అమ్మకాలు పడిపోవడం, EV వ్యూహ ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. ఇప్పటికే జూలైలో యాజమాన్యం 9,000 ఉద్యోగాల తొలగింపునకు అంగీకరించింది.