హైదరాబాద్: 28°C
వ్యాపారం

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1420 పెరిగి రూ.1,55,840కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1300 పెరిగి రూ.1,42,850 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,55,100 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.