హైదరాబాద్: 28°C
వ్యాపారం

హీరో మోటార్స్‌ ఐపీవోకు 6 రెట్ల స్పందన

విడిభాగాల తయారీ సంస్థ హీరో మోటార్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఇవాళ్టితో ముగిసింది. చివరి రోజు పూర్తయ్యేసరికి 6.66 రెట్లు బిడ్లు అందుకుంది. రూ.1000 కోట్ల ఐపీవోలో భాగంగా ధరల శ్రేణిని రూ.79-84గా కంపెనీ నిర్ణయించింది. అలాగే, NII కోటా 9.86 రెట్లు, రిటైల్ పోర్షన్ 8.23 రెట్లు, క్యూఐబీ కోటా 1.49 రెట్లు స్పందన అందుకుంది.