హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు పాపన్న గౌడ్ పేరు పెట్టాలి'

WGL: మామునూరు విమానాశ్రయానికి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని తెలంగాణ గౌడ సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు తోటకూరి శ్రీకాంత్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సామాజిక సమానత్వం,బహుజనుల ఆత్మగౌరవం కోసం పాపన్నగౌడ్ చేసిన పోరాటాన్ని గుర్తిస్తూ ఆయన పేరు పెట్టడం సముచితమన్నారు.ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నామకరణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.