SRD: న్యాల్కల్ మండలం హద్నూర్ పరిసర ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఆదివారం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి వీధులు, ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతం జలమయమయ్యాయి. వాహనదారులు, బాటసారులు వర్షంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలకు వేడి నుంచి ఉపశమనం లభించింది.
తెలంగాణ
ఉరుములు, మెరుపులతో వర్షం


