హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువకుడిపై విచక్షణారహితంగా దాడి

VKB: దోమ మండలంలోని మోత్కూరు గ్రామంలో యువకుల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. గ్రామానికి చెందిన గోపాల్‌పై అదే ప్రాంతానికి చెందిన నర్సింహులు, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. పట్టపగలు జరిగిన ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.