NZB: సిరికొండమండలంలోని మైపాల్ తండాలో ఆదివారం మధ్యాహ్నం పిడుగులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో లింబ్య నాయక్‌కు చెందిన గేదె పిడుగుపాటుకు గురై మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.80 వేలకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. పశువును కోల్పోవడంతో తనకు ఆర్థిక నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.
తెలంగాణ
పిడుగుపాటుకు గేదె మృతి


