హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇద్దరు డీజే నిర్వాహకులపై కేసులు

KMM: బోనకల్ మండలంలో శనివారం రాత్రి వినాయక నిమజ్జన ఊరేగింపులో అనుమతులు లేకుండా డీజేలు ఏర్పాటు చేసిన ఇద్దరు నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ రవి తెలిపారు. డీజేలు ఏర్పాటు చేయవద్దని వినాయక చవితి కమిటీ సభ్యులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామన్నారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే కమిటీ సభ్యులు, నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.