హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణనాథుని దర్శించుకున్న మున్సిపల్ ఛైర్మన్

NGKL: పట్టణంలోని మైల్ స్టోన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని ఆదివారం మున్సిపల్ ఛైర్మన్ తీగల సనేంద్ర కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుని ఆశీస్సులతో నాగర్ కర్నూల్ పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మున్సిపల్ ఛైర్మన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పడిగే శంకర్ తదితరులు పాల్గొన్నారు.