హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్రాల చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్

VKB: చిట్టంపల్లి సమీపంలో గొర్రెల కాపరుల వద్ద ఉన్న మూడు గుర్రాలను బొలేరో వాహనంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుడు సాయిలు ఫిర్యాదుతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌లోని జియాగూడలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఒమన్, సమీర్, ఆసిఫ్‌పై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.