హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖైరతాబాద్ వద్ద భక్తుల రద్దీ.. భారీ లైన్

HYD: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. దాదాపు రెండు కిలో మీటర్ల మేర లైన్‌లో వేచి ఉన్నారు. దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. దీంతో వృద్ధులు, చిన్న పిల్లలను తీసుకు రావొద్దని ఖైరతాబాద్ కమిటీ కోరింది. ఈ ఒక్కరోజే లక్ష మంది వచ్చే అవకాశం ఉందని నిర్వాహణ కమిటీ తెలిపింది.