హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవం పోస్తుందా.. జీవం తీస్తుందా..?

WGL: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే పేద రోగులకు సమస్యలు వెంటాడుతున్నాయి. గతంలో ఎలుకలు సంచరించి రోగులను కరిచిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలతో పాటు పలు విభాగాల్లో శునకాలు, వానరాలు సంచరిస్తున్నాయి. 1954-55లో నిర్మించిన ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరి పెచ్చులూడి రోగులకు గాయాలవుతున్నాయి.