హైదరాబాద్: 28°C
తెలంగాణ

వివాహేతర సంబంధం.. మహిళ హత్య

KMR: లింగంపేట్ (M)నాగారం శివారులో మహిళా మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. SI దీపక్ వివరాల ప్రకారం.. కొర్పోల్ గ్రామానికి చెందిన సాయిలు, అనసూయ మధ్య వివాహేతర సంబంధం ఉంది. శనివారం అర్థరాత్రి నాగారం శివారులో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో సాయిలు ఆవేశంతో ఆమె తలపై కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని SI తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.