హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశ్ నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్డీవో

NLG: నల్లగొండ మండల పరిధిలోని వల్లభరావు చెరువులో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాల నిమజ్జన ప్రాంతాన్ని, ఈరోజు నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి పరిశీలించారు. తహశీల్దార్, మున్సిపల్ సిబ్బందితో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి, అవసరమైన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.