నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఆశానగర్ శివారులో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫాంపాండ్లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి యువకుడు మృతి చెందాడు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టి యువకుడి మృతదేహన్ని బయటకు తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఈతకు వెళ్లి యువకుడి దుర్మరణం


