WGL: పర్వతగిరి మండలం చెరువుకొమ్ముతండాలో విద్యుత్ వైర్ తెగిపడి ప్రమాదకరంగా మారింది. శనివారం వైర్ తెగిపడిన విషయాన్ని గ్రామస్తులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఆదివారం కూడా అధికారులకు సమాచారం అందించినా స్పందన లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వైర్‌ను సరిచేయాలన్నారు.
తెలంగాణ
తెగిపడిన విద్యుత్ వైర్‌తో ప్రమాదం


