హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్ అనర్థాలపై ప్రత్యేక నాటకం

SRPT: కోదాడ పట్టణంలో నిర్వహించిన వినాయకుడి శోభాయాత్రలో ఈరోజు ఓ కళాశాల విద్యార్థులు ప్రత్యేక నాటకం ప్రదర్శించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలనే సందేశాన్ని నాటకం ద్వారా అందించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ యువతలో అవగాహన కల్పించారు. శోభాయాత్రలో పాల్గొన్న ప్రజలు విద్యార్థుల ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించారు. అనంతరం విద్యార్థులపై ప్రశసంలు కురిపించారు.