హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీరు లేక నిమజ్జనానికి నోచుకోని గణనాథుడు

KNR: ఎల్‌నినో ప్రభావంతో అనేక ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. KNR(D) శంకరపట్నం(M) కేశవపట్నంలో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం కోసం స్థానిక గొల్లపల్లి బొంకుంట చెరువు వద్దకు నిర్వాహకులు తీసుకెళ్లారు. అయితే, చెరువులో చుక్క నీరు లేకపోవడంతో నిమజ్జనం చేయడానికి వీలుపడక నిరాశతో గణనాథుడిని అలాగే వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.