హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేక్ పాయింట్‌కు చేరిన యూరియా

KMM: చింతకాని మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఎన్ఎఫ్ఎల్ (NFL) కంపెనీకి చెందిన 2646 మెట్రిక్ టన్నుల యూరియా ఆదివారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1846 మె.టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 400 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 300 మె.టన్నులు కేటాయించగా మిగతా 100 మె.టన్నులు బఫర్ స్టాక్‌గా నిల్వ చేశామని DAO డీ.పుల్లయ్య తెలిపారు.