SRCL: వేములవాడలో గణేష్ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గణనాథుడిని దర్శించుకున్నారు. సంఘం ఆహ్వానం మేరకు విచ్చేసిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాడకట్టు ప్రజలు, పట్టణ ప్రజలను గణపతి దేవుడు సుఖసంతోషాలతో చల్లగా చూడాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
గణనాథుడిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్


