హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జూరాల వద్ద రైతుల భారీ ధర్నా

  జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు కుడి, ఎడమ కాలువల వద్ద భారీగా నిరసన చేపట్టారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం ఎడమ కాలువ గేట్లు స్వయంగా ఎత్తి నీటిని విడుదల చేసుకున్నారు. దీంతో ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై అధికారుల అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.