హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఢీకొన్న లారీ

MHBD: తొర్రూరు పట్టణంలోని పాలకేంద్రం సమీప సర్కిల్‌లో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆదివారం ఓ బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో విగ్రహం ధ్వంసమైంది. ఖమ్మం నుంచి మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు బొగ్గుతో వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. లారీ విగ్రహాన్ని ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పింది.