హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండెపోటుతో సుల్తాన్‌పూర్ వాసి మృతి

BHPL: కొత్తపల్లిగోరి మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన కోడూరి రాజమౌళి ఎండ తీవ్రత కారణంగా గుండెపోటుకు గురై మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో రాజమౌళికి ఒక్కసారిగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కుటుంబ సభ్యులు చికిత్స కోసం తరలించేలోపే మృతి చెందినట్లు తెలిపారు.రాజమౌళి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.