SDPT: ఎల్లమ్మ చెరువు కట్ట సమీపంలోని స్మశాన వాటికలో గుర్తుతెలియని యువకుడు మూడు రోజులుగా సమాధుల మధ్య నిద్రిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. యువకుడి కదలికలను గమనించిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. హిందీలో మాట్లాడుతున్న అతడి వివరాలు, అక్కడ ఉండటానికి గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు.
తెలంగాణ
మూడు రోజులుగా స్మశాన వాటికలో యువకుడు


