హైదరాబాద్: 28°C
తెలంగాణ

డైమండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వినాయక పూజలో యాంకర్ శ్యామల

MDCL: ఉప్పల్‌లోని డైమండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో వైసీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డైమండ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఆమెను శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గుడ్డిసా రాజు తదితరులు పాల్గొన్నారు.