BDK: టేకులపల్లి మండలం సాయన్నపేటలో ఆదివారం ద్విచక్ర వాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఇల్లందు నుంచి కొత్తగూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహన చోదకుడు ఎడమవైపు పడిపోగా, వెనుక కూర్చున్న గుగులోత్ ఉమా లారీ వెనుక టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతిచెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి


