MDCL: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇవాళ ఉదయం కూకట్‌పల్లి డివిజన్‌లో పలు వినాయక మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, గణేష్ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. మండపాల నిర్వాహకులు, భక్తులతో మాట్లాడి ఉత్సవాల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
గణేష్ మండపాల వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు


