హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా చిలుకయ్య

ASF: చింతలమానేపల్లి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా అంగోలు చిలుకయ్య నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని చిలుకయ్య తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదలకు అందేలా కృషి చేస్తానన్నారు. నియామకానికి సహకరించిన ఎమ్మెల్సీ దండె విఠల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.