హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా రద్దీకి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

HYD: దసరా రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య అక్టోబర్, నవంబర్‌లో 16 ప్రత్యేక సర్వీసులు, చర్లపల్లి-నాగర్‌కోయిల్ మధ్య 10 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.