హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి అడ్లూరి

JGL: బుగ్గారం మండల కేంద్రంలో సజీరా రహీముద్దీన్‌కు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య ఉన్నారు.