హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా అంబేద్కర్ స్మరణ కార్యక్రమం

జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 'ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథి నర్ర రాజేందర్ మాట్లాడుతూ.. నేటి యువత మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని, రాజ్యాంగ హక్కులను తెలుసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని తెలిపారు.