హైదరాబాద్: 28°C
తెలంగాణ

నత్తనడకగా రోడ్డు పనులు

VKB: కొర్విచేడ్-తాండూరు రోడ్డు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. అక్కడక్కడ సగం రోడ్డుకే కంకర పరచడంతో వర్షానికి బురద ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము, గుంతలతో ప్రయాణం కష్టంగా మారింది. సరైన సూచిక బోర్డులు, రాత్రి లైట్లు లేక కంకర, గుంతలు గుర్తించలేక ప్రమాదాల భయం నెలకొంది. పనులు వేగవంతం చేసి సూచికలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.