VKB: తాండూరు కోర్టు ప్రాంగణంలోని పురుషుల మరుగుదొడ్డి అధ్వాన్నంగా మారింది. నీటి సౌకర్యం లేకపోవడంతో పాటు దోమల బెడద తీవ్రంగా ఉందని వినియోగదారులు వాపోతున్నారు. నేలపై బురద, మురికి పేరుకుపోగా, ఖాళీ ప్లాస్టిక్ సీసాలు చెల్లాచెదురుగా కనిపిస్తున్నాయి. టాయిలెట్లు కూడా అపరిశుభ్రంగా మారాయి. ప్రజలు అధికంగా వచ్చే ప్రాంతంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.
తెలంగాణ
తాండూరు కోర్టులో అధ్వాన్నంగా పారిశుద్ధ్యం


