హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాస్కెట్‌బాల్ విజేతలను సన్మానించిన SE

KNR: విద్యుత్ శాఖ ట్రాన్స్‌కో, డిస్కం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో విజేతగా నిలిచిన ఉమ్మడి కరీంనగర్ జట్టు సభ్యులను జిల్లా SE బి.సుదర్శనం ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగంతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే ఉద్యోగులను ప్రోత్సహిస్తామని తెలిపారు. జట్టు కెప్టెన్ రాజు, DE కె.గంగారాం పాల్గొన్నారు.