హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కారు ఢీకొని మూడేళ్ల బాలుడు మృతి

HYDలోని సంతోష్‌నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. మొహియుద్దీన్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి సంతోష్‌నగర్‌లోని IS సదన్ X రోడ్డులోని ఓ హోటల్‌కు వెళ్లాడు. అదే సమయంలో మొహియుద్దీన్ కొడుకు ఇజ్ఞాన్ ఉద్దీన్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. బాలుడిని ఆసుపత్రికి తరలించగా,అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.