హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు!

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం వద్ద ఆదివారం కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం తిరుమలగిరి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.