హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్వాహకులకు, ప్రజలకు ఎస్సై సూచన

MNCL: వినాయక విగ్రహాల నిమజ్జన సమయంలో నిర్వాహకులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 29 గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జన సమయంలో డీజేల వినియోగానికి అనుమతి లేదన్నారు. అందరూ జాగ్రత్తలు పాటించాలన్నారు.