WGL: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో ఇవాళ స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న మస్తాన్ (55), అటెండర్లు ఎల్లమ్మ (50), ఓంకార్ (33) గాయపడ్డారు. జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్‌కు చెందినవారిగా గుర్తించారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో రోగులు, అటెండర్లు ఆందోళనకు గురయ్యారు.
తెలంగాణ
MGM ఆసుపత్రిలో పైకప్పు పెచ్చులు రాలి రోగులకు గాయాలు


