హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కుండీలో పడిపోయిన గోవును రక్షించిన కౌన్సిలర్

MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ, 3వ వార్డులో ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోవును కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ మున్సిపల్ సిబ్బంది సహాయంతో ప్రాణాలతో రక్షించారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎంతో చాకచక్యంగా గోవును బయటకు తీయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.