హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విలీన గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించాలి'

SRCL: వేములవాడ మున్సిపల్‌లో విలీనమైన గ్రామాల ప్రజలకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజాల శ్రీధర్ డిమాండ్ చేశారు. రోజువారీ వేతనం రూ.600 చెల్లించాలని కోరారు. నాంపల్లి దళితవాడలో ప్రజల సమస్యలను పరిశీలించిన ఆయన, విలీనంతో ఉపాధి అవకాశాలు తగ్గి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.